గుండెపావురం (నాలుగవ కవిత అతివ-అంతర్మధనం )
(అపాత్రదానంగా మిగిలిన మహిళ జీవన్మరణ స్మరణం )
ఎంత చిత్రమైనదీ జీవితం ?
అంతలోనే ఆశ! ఇంకోద్దిసేపటికే నిరాశ!!
ఆశ, నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతూ
మునగలేక తేలలేక
త్రిశంకు స్వర్గంలా మారిన జీవితంతో
ఎన్నాళ్ళీ సహవాసం ?
ఆనందాన్ని పంచుకోవాలన్నప్పుడు
తోడు దొరకదు
విషాదాన్ని దాచుకోవాలన్నా
వీలు వుండదు
పదిమందిలో వున్నా
మోయలేని ఒంటరితనం ....
ఒంటరిగా వుంటే
జీవన స్మృతుల గుస గుసలు
గలగల రాలిపోతున్న గాజు పెంకుల్లా మారి
గుండె పావురానికి గుచ్చు కున్నాయి
అంపశయ్య పైన భీష్ముడిలా
ఆలోచనల ముళ్ళ పైన వుండే మనసుకు
చని పోదామన్నా బాధ్యతా బంధాలు బిగుస్తున్నై
బిగుస్తున్న కొద్దీ
మనసు చచ్చి పోతుంది
కాని ................
ఏం చేయను ?
వ్యర్తమైన శరీరం ఇంకా బతికే వుంది కదా...?
Labels: గుండె పావురం


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home