సుమంగళి (మూడవ కవిత .అతివ -అంతర్మధనం)
(సమాజంలో పరువు కోసం భర్త పెట్టే బాధలని భరిస్తున్న పడతి ఆక్రోశం )
వివాహ బంధమంటే
ఆత్మవంచన ముసుగులో
అభిమానపు అపహాస్యం
నూరేళ్ళ నడకకు
అడుగడుగునా స్పీడ్ బ్రేకర్లు
మూడుముళ్ల జీవితానికి
నలుగుతున్న అనుబంధం
కన్న ప్రేమ రుణానికి
కాలుతున్న మానవత్వం
సుమంగళి గ మిగలాలంటే
నడుస్తున్న నిప్పుల కుంపటి
సంస్కరించాలంటే .......................
అణువణువున జీర్ణించుకున్న
సాంప్రదాయపు చితిమంటలలో
నిత్యాహుతిగా వెలుగుతూ
అనునిత్యం కాలిపోతూ కూడా
కరిగిపోతున్న బంధాన్ని కాపాడుకుంటూ
ప్రేమ,సహనం.అనే ముళ్ళకిరీటం తో
రక్తసిక్తమైన మనసుతో
రగిలిపోతూ కూడా
ఆనందాన్ని, సంతృప్తిని
అతికష్టంగా నటిస్తూ
మగడు ఆడిస్తున్న సంసార రంగస్థలి పై
ఎన్నిరోజులీ సుమంగళి నాటకం...?
Labels: సుమంగళి -----


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home