Sunday, July 12, 2009

ఆత్మవంచన (అతివ-అంతర్మధనం ,రెండవ కవిత )

(వరకట్నపు కోరలలో చిక్కుకున్న అతివ ఆక్రోశం )

కాలకన్య కౌగిలి లో
కాళరాత్రి నిదురిస్తున్న వేళ
కనురెప్పల మాటున
కన్నీటిని దాచుకుని
కుమిలిపోతూ,క్రుంగిపోతూ
ఎన్నాళ్ళుఈ జీవనయానం ?
ఆప్యాయతల మేలిముసుగులో
నిరంకుశపు నీలిజాడలు
అంతస్తుల పరదాలలో
అభిజాత్యపు పడగనీడలు

అనుబంధాల అడకత్తెరలో
అస్తిత్వపు చావుకేకలు
అంతులేని జీవిత సంద్రంలో
నిరంతర ఆటుపోటులు

బాధలని భరిస్తూ
బంధాలని మననం చేస్తూ
మనసు చంపుకుని
మమతల రంగు పులుముకొని
ఎన్నాళ్ళు ఆత్మ వంచన?
ఎన్నాళ్ళు ఈ నిరంతర వేదన .....?

Labels:

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home