Wednesday, July 15, 2009

గుండె పావురం (నాలుగవ కవిత .అతివ-అంతర్మధనం )

(అపాత్రదానంగా మిగిలిన మహిళ జీవన్మరణ స్మరణం )

ఎంత చిత్రమైన దీ జీవితం?
అంతలోనే ఆశ! ఇంకోద్దిసేపటికే నిరాశ!!

ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతూ
మునగలేక తేలలేక
త్రిశంకు స్వర్గంలా మారిన జీవనంతో
ఎన్నాళ్ళు సహవాసం?

ఆనందాన్ని పంచుకోవాలన్నప్పుడు
తోడు దొరకదు
విషాదాన్ని దాచుకోవాలన్నా
వీలు పడదు

పదిమందిలో వున్నా
మోయలేని ఒంటరితనం .......
ఒంటరిగా వుంటే .......
జీవనస్మ్రుతుల గుసగుసలు
గల గల రాలిపోతున్న గాజు పెంకుల్లా మారి
గుండె పావురానికి గుచ్చుతున్నవి

అంపశయ్య పై భీష్ముడిలా
ఆలోచనల ముళ్ళ పై వుండే మనసుకు
చనిపోదామన్నా బాధ్యతా బంధాలు

బిగుసుకు పోతున్నవి


బిగిసుకుంటున్న కొద్దీ

మనసు చచ్చిpothunnadi

కాని

emcheyanu?

vyarthamaina శరీరం ఇంకా

brathike

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home