Thursday, March 17, 2011

యువతా !

మీడియా అంటే ఒక ఆయుధం !!

మీడియా అంటే ఒక సమున్నత శక్తి..!!!

మీడియా అంటే ఒక స్ఫూర్తి..!!!!

మీడియా అంటే ఒక చైతన్యం..!!!!



............

వ్యాపారాన్ని అభివృధ్హి చేయాలంటే

వ్యాపార ప్రకటనలు ఉండాలి

టివి కార్యక్రమాలు సజావుగా సాగాలంటే

యాడ్స్ చూపించాల్సిందే..

కాని....



దానికోసం

వనితలను వ్యాపార వస్తువులుగా

చూపించటం బాగాలేదు

బాడీ స్ప్రే యాడ్ చూస్తుంటే

చూడాలంటే సిగ్గు వేస్తుంది...

వనిత వ్యక్తిత్వాన్ని ఒక స్ప్రే బాటిల్ కన్నా

హీనం చేసే ఇటువంటి

యాడ్స్ ని !నిషేధించండి !!

వీలు చేసుకుని మరీ పోరాడండి..!

సెన్సార్ బోర్డు అనేది ఉందా

అని నిలదీయండి..!!!



భర్త కన్నా..టీచర్ వృత్తి కన్నా ...

తన వ్యక్తిత్వం కన్నా... బాడి స్ప్రే కి

పరవశించి పోయే పడతులుగా

నటిస్తున్న నటీమణులకు

అది తప్పని తెలియ చెప్పేలా

యువతా! ఏదో ఒకటి చేయండి ప్లీజ్!!!!

Labels:

Thursday, March 10, 2011

ప్రశార్ధకం???

దేవా ! మాతృత్వం వరమా..?
ఆడపిల్ల అని
కడుపులోనే చంపేస్తారేమో?

అమ్మో! కాలేజీ చదువా?
రాగింగ్ చేస్తారేమో..?

ఓరి నాయనో ! ప్రేమా ?
యాసిడ్ పోస్తారేమో..?

అమ్మబాబోయ్ ! పెళ్ళా ?
కట్నం కోసం
కాలుస్తారేమో ?
ఇదీ ...
ప్రస్తుత సమాజంలో సగటు యువతి
పడే ఆందోళన... ఆవేదన..ఆక్రందన ...
ఇక ఇవి ప్రశ్నలు గా మిగిలి పోవలిసిందేనా?






పడే ఆందోళన..ఆవేదన..ఆక్రందన ...

Labels:

Wednesday, March 9, 2011

రారాజులు-రారాణులు

నేటి యువతీయువకులు
నాటి ఉద్యమ స్పూర్తితో
రాబోయే కాలానికి
రారాజులు-రారాణులు కావాలి

సంపాదన మాత్రమే సరిపోదు
సంతోషంగా జీవించే సమయం కావాలి
సమానంగా ఆనందించే తోడు కావాలి
సగర్వంగా జీవించే సమాజం కావాలి

చదువు, సంపాదన
పెళ్లి, పిల్లలు ,ఇవన్ని
ప్రతివారి జీవితంలో
అల్లుకుపోయే భాద్యతలు

కాబోయే, తల్లులు, తండ్రులూ ....
స్వచమైన సమాజానికి
మీ చిన్నారులను ఆహ్వానించండి ...
ఎంతో కొంత సమాజ సంస్కరణను
ఇప్పటినుండే మొదలుపెట్టండి...

ఫేసు బుక్కులకు, చాటింగ్ లను
టైం పాస్ కబుర్లకే పరిమితం చేయకుండా
సామాజిక బాద్యత పంచుకోవాలి
స్నేహ, సౌజన్యాలు పెంచుకోవాలి..!!!!!

Labels:

Tuesday, March 8, 2011

విజయహాసం

చరాచర జగతిలో
అనంత సృష్టి లో
మమేకమై, అద్భుతమైన
అపురూప పాత్రను పోషించే
అమృతమయమైన స్త్ర్రీ మూర్తి లేని
జీవితాన్ని ...
ఊహించడం ,, దుర్లభం ..దుర్భరం...

అద్వితీయమైన ఆ దేవతామూర్తికి
లభిస్తున్నదేమిటి???
అంతులేని భావదాస్యం..
అప్రతిహత పాలన ..
పరాధీనమైన జీవితం..
అవమాన, అనుమాన భరిత జీవనం
అత్యాచార ,గృహ హింసల పీడనం
బ్రతుకే భారంగా మారుతున్న జీవన యానం
కాని......................
పురిటినొప్పులు ఆమెకి కొత్త కాదు
ఎదురుదెబ్బలు తెలియనివి కావు
మొండి ధైర్యం తో
మొక్కవోని ఆత్మవిశ్వాసంతో
మొక్కగా , చెట్టుగా ఆ తర్వాత మహావృక్షం గా ఎదిగి
విశ్వమంతా వ్యాపిస్తుంది ..
విజయహాసంతో నినదిస్తుంది.