Wednesday, March 24, 2010

నేనేమని బదులు చెప్పను?(అతివ-అంతర్మధనం) ఆరవ కవిత

(అనుమానపు భర్తతో రగిలిపోతున్న ఓ ఇల్లాలి అంతరంగం )

వధ్యశిలకు కొనిపోబడుతున్న మేకపిల్లలా
అనుక్షణం మృత్యువుకు చేరువ అవుతూ ,
గడిచిన క్షణాల్లో విషపు చుక్కలని దాచుకుని
స్మృతుల్లో చేదుజ్ఞాపకాలు నింపుకుని


జీవితంలోని అమృతం ఒలికిపోతుంటే
సంసారమనే శలభాగ్ని లో మాడిపోతూ

బాధ్యతలనే యజ్ఞంలో సమిధలా
కాలిపోతున్న నన్ను చూస్తూ కూడా
గులాబీ పూల పొత్తిళ్ళలో వున్నావు కదా !
నీకున్న సుఖం ఎవరికున్నదంటు
నీవు వేసిన ప్రశ్నకు నేనేం బదులు చెప్పను?

,

Labels:

పరాధీన (అతివ-అంతర్మధనం ) ఐదవ కవిత

(భర్త చనిపోయి సోదరుల పంచన చేరిన ఒక అభాగిని ఆవేదన )

గడిచిపోయిన గతంలోకి
భారంగా తొంగి చూస్తె
భావాతీతమైన జ్జ్ఞాపకాల తలుపులు
గభాలున తెరుచు కుంటాయి

గోలు గోలు మంటూ గొడవ చేస్తుంది హృదయం
మసకబారిపోయిన మనసు అద్దంలో
వెలసిపోయిన స్మృతుల దొంతరలు
కదిలిస్తే చాలు గలగలమని కూలిపోతున్నాయి
గతకాలపు వెతలన్ని ముక్కలు ముక్కలుగా కనపడుతున్నాయి

ఆవేదనను. ఆత్మాభిమానాన్ని
ఆలోచనలను అన్ని అణచుకుని
పరాధీనగా బ్రతకాలంటే
భరించలేక పోతున్నాను
ఎన్నాళ్ళు ఈ భావదాస్యం?
ఎంతవరకు ఈ అప్రతిహతపాలన ????

Sunday, March 7, 2010

hemalatha putla - Ask.com Search

hhemalatha putla - Ask.com Search: "hemalathaputla"

Happy women's Day lathaaji- Renuka Rani....

Thursday, March 4, 2010

Facebook | Privacy Settings

Facebook Privacy Settings: "About"prasthutam samajamlo digajarutunna naithika viluvala gurinchi vedana chenduthu vuntaanu. mahila patla jargutunna ahinsa , athyachaarala patla badha paduthu ivanni maarche shakthi iste bavudunanai devunni vedukuntu,maarchagalige uvatha kosam nireekshistuuuuu....nna streeni. vruthi reethya teacerni, pravruthi reethya rachayitrini.

Facebook | Getting Started

Facebook Getting Started: "Find"